సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్

మరింత ఆలస్యంకానున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

ts eamcet
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యంకానున్నాయి. నిజానికి ఫలితాలను ఈ వారమే విడుదల చేయాల్సివుంది. కానీ, అనివార్య కారణాలతో ఈ ఫలితాలను ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. 
 
ఎంసెట్ విభాగంలో అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 94,476 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. గత నెల 30, 31 తేదీల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 80,575 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,56,812 మంది హాజరయ్యారు. 
 
ఇకపోతే, ఈ ఫలితాల విడుదల జాప్యంపై తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను వచ్చే వారం విడుదల చేస్తామన్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను జేఈఈ కౌన్సెలింగ్‌తో అనుసంధానం చేసినట్టు చెప్పారు. కాబట్టి ఇది ఇక్టోబరు చివరివారం వరకు జరుగుతుందని చెప్పారు. నవంబరు ఒకటో తేదీ నుంచి క్లాస్ వర్క్ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు.