మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (12:22 IST)

యూపీఎస్సీ షెడ్యూల్ విడుదల

upsc
2023 సంవత్సరానికి సంబంధించి నిర్వహించే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) బుధవారం నాడు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. యూపీఎస్సీ వార్షిక పరీక్ష క్యాలెండర్‌ను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉంచారు. 
 
ఈ షెడ్యూల్ ప్రకారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 28, 2023న నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష నోటిఫికేషన్ ఫిబ్రవరి 1, 2023న విడుదల కానుంది.
 
దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 21, 2023ను చివరి తేదీగా ప్రకటించారు. అలాగే సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష సెప్టెంబర్ 15, 2023న నిర్వహించబడుతుందని తెలిపారు.