1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 జనవరి 2015 (15:10 IST)

పిల్లల్లో స్వార్థం పెంచకండి!

పిల్లల్లో స్వార్థం పెంచకూడదు. చిన్నప్పటి నుంచి ఏది తినినా.. ఇతరులకు కాసింత ఇవ్వడం అలవాటు చేయాలి. మొండితనం లేకుండా చూసుకోవాలి. స్వార్థపూరిత ఆలోచనలకు బ్రేక్ వేయాలి. అలాగే పాఠశాలల్లో సమావేశ నిర్ణయాలు తరగతిలోని పిల్లలందరినీ ఉద్దేశించి ఉంటాయి. తమ పిల్లలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు అలాగే ఉండాలని అనుకోవడం పొరపాటు. 
 
పేరెంట్స్ మీటింగ్ వల్ల పిల్లల గురించి టీచర్ నుంచి ఎక్కువ అంశాలు తెలుసుకునే వీలుంటుంది. అలాగే తల్లిదండ్రులు తమవైపు నుంచి పిల్లల అవసరాల్ని వివరించే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు ఓపెన్‌హౌస్‌ల గురించి ఇష్టపడరు. 
 
వీటిలో తమ పిల్లల గురించి విమర్శలు, ఫిర్యాదులు వినాల్సి వస్తుందేమోనని వారి భయం. ఈ కారణంగా ఓపెన్ హౌస్‌లకు దూరంగా ఉండటం సమంజసం కాదు. సదరు ఫిర్యాదుల్ని, విమర్శలను పరిగణనలోకి తీసుకుంటేనే పిల్లల్లోని లోపాల్ని తెలుసుకుని సరిదిద్దే వీలుంటుంది.