గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 29 జులై 2023 (23:50 IST)

మెత్తమెత్తగా రుచికరంగా చపాతీలను ఎలా చేయాలి?

chapati
చపాతీలు. చపాతీలను చేయడంలో చాలామంది మెళకువ వహించరు. దాంతో అవి గట్టిగా మారి తింటుంటే దవడలు నొప్పి పెడుతూ వుంటాయి. అలా కాకుండా మెత్తగా వుండేట్లు చపాతీలు చేసుకుని రుచికరంగా తినేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాము. చపాతీలు రుచికరంగా, మెత్తగా వుండాలంటే చపాతీ పిండిలో కాస్త గోరువెచ్చని పాలు పోసి పిండి కలిపితే మృదువుగా వస్తాయి.
 
పిండి మృదువుగా వుండాలంటే చపాతీ పిండికి 6:4 నిష్పత్తిలో నీటిని-పాలను కలుపుకోవాలి. చపాతీ పిండిని గోరువెచ్చని నీటితో కలుపుతూ అందులో చిటికెడు ఉప్పు, అర టీస్పూన్ చక్కెర కలిపితే మెత్తగా వుంటాయి. చపాతీలు మెత్తగా వుండాలంటే బేకింగ్ సోడాను పిండిలో కలిపి చేయాలి.
 
చపాతీలు చేయాలనుకున్నప్పుడు పిండిని కలిపాక కనీసం గంటవరకూ చపాతీలు చేయకూడదు. చేస్తే గట్టిపడతాయి. చపాతీలు చేసేటపుడు చాలామంది పొడి పిండిని వాడుతుంటారు, ఈ పిండి వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతగా చపాతీలు మెత్తగా వస్తాయి. చపాతీలు మృదువుగా వుండి పొంగాలంటే గోధుమ పిండిలో కాస్త పెరుగు లేదా మజ్జిగ కలుపుకోవచ్చు.