శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: సోమవారం, 13 జులై 2020 (21:20 IST)

ఆగని కరోనా విజృంభణ! షాద్ నగర్ డివిజన్లో నేడు 30 పాజిటివ్ కేసులు

కరోనా మహమ్మారి ఆగకుండా విజృంభిస్తోంది. ఈ ఒక్కరోజే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్లో 30 పాజిటివ్ కేసులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ గణాంకాలతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.
 
డివిజన్లో మొత్తం ముప్పై కరోనా పాజిటివ్ కేసులు ఈ ఒక్కరోజే నమోదు కావడం గమనార్హం. అయితే ఇందులో పట్టణంలోనే 20 పాజిటివ్ కేసులు ఉండటం గమనార్హం. చాలా కాలనీల్లో ఇది విస్తరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే సుమారు గణనీయంగా బాధితుల సంఖ్య పెరిగింది. ఈ ఒక్కరోజే 30 కేసులు నమోదు అయితే పరిస్థితి ఇంకా ముందు ఏ విధంగా ఉంటుందో వేరేగా చెప్పనక్కర్లేదు.
 
ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించేందుకు కొన్ని వ్యాపార సంస్థలు ముందుకు వచ్చాయి. ఇది అభినందనీయం కానీ ఇదే కోవలో స్వచ్ఛందంగా ముందుకు అన్ని వ్యాపార సంస్థలు వస్తే ఫలితం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. లేకపోతే కరోనా విజృంభణ ఇప్పట్లో ఆపడానికి వీలు కూడా లేకుండా పోతుంది. ప్రస్తుతం పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభించింది.. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ చేసుకుంటే మేలు షాద్ నగర్ ప్రజలారా పారా హుషార్.