తెలంగాణలో కొత్తగా 894 కొవిడ్ పాజిటివ్‌ కేసులు

Virus
ఎం| Last Modified శుక్రవారం, 20 నవంబరు 2020 (13:26 IST)
హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కేసుల సంఖ్య 2,61,728కి చేరుకుంది. ఈనెల 19న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

మహమ్మారి బారినపడి మరో నలుగురు మృత్యువాతపడగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,423కు చేరుకుంది. నిన్న మరో 1,057 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,47,790కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,515గా ఉంది. సోమవారం 39,448 కొవిడ్‌ నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :