మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:20 IST)

జర్నలిస్టులపై కరోనా పడగ... నానాటికీ పెరుగుతున్న కేసులు

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పగబట్టినట్టుగా ఉంది. ఎందుకంటే.. గత మూడు రోజులుగా పలువురు జర్నలిస్టులు కరోనా వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. తొలుత ముంబైలోనూ, ఆ తర్వాత చెన్నైలో విలేకరులు ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో విధులు నిర్వహించాలంటేనే వారు వణికిపోతున్నారు. 
 
తాజాగా చెన్నై నగరంలో పనిచేసే మరో 10 మంది జర్నలిస్టులకు పాజిటివ్‌ తేలడంతో ఆందోళన నెలకొంది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పటికే 50 మంది జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు.
 
నిజానికి మంగళవారం ఓ ప్రైవేట్ టీవీలో పని చేసే విలేకరుల్లో 27 మందికి ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. తాజాగా మరో పది మందికి ఈ వైరస్ సోకింది. జర్నలిస్టులు వేగంగా వైరస్‌ బారిన పడుతుండడంతో మీడియా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. 
 
వారు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కార్యాలయాలకు వస్తే అక్కడి సిబ్బందికి ఎక్కడ విస్తరిస్తుందో అన్న ఆందోళన నెలకొంటోంది. అదే సమయంలో క్షేత్ర స్థాయి విధులు నిర్వహించే వారికి వైరస్‌ సోకకుండా ఏ చర్యలు చేపట్టాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.