గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శుక్రవారం, 24 జులై 2020 (14:22 IST)

ఏపీలో ఆ మూడు జిల్లాలలో కరోనావైరస్ ఉధృతి... ప్రజలే లాక్‌డౌన్ విధించుకుంటున్నారు...

ఆంధ్రప్రదేశ్ నందు కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కరోనా కేసులు అధిక సంఖ్యలో పెరిగిపోతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్నకొద్దీ  కేసులు కూడా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు పెరిగాయి. ఈ మహమ్మారి నియంత్రణకు జగన్ సర్కారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నది.
 
కొన్ని జిల్లాలో ప్రజలు స్వయంగా లాక్డౌన్ కూడా విధించుకున్నారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72,711 ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా 884 మంది మరణించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, గుంటూరు, తూర్పుగోదావరి... ఈ మూడు జిల్లాలలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉంది.
 
పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా పెరుగుతున్నది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఈ జిల్లాలో కరోనా 10 వేల మార్కును దాటింది. ప్రస్తుతం అక్కడ 10,038 కరోనా కేసులు ఉండగా 96 మంది మరణించారు. ఇక్కడ 6786 యాక్టివ్ కేసులు ఉండగా 3156 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరులో 8701 పాజిటివ్ కేసులు నమోదు కాగా 142 మంది మరణించారు. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.