గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (10:49 IST)

ఢిల్లీలో కరోనా.. 13మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు పాజిటివ్

corona
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడాలో కేసులు అమాంతం పెరిగాయి. గత 48 గంటల్లో నోయిడాలో కొత్తగా 53 కేసులు వెలుగుచూశాయి. అయితే వీటిలో ఎక్కువ కేసులు పాఠశాలల్లో వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. 
 
నోయిడా సెక్టార్ 40లోని ప్రైవేట్ స్కూల్లో 13 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఘజియాబాద్‌లోని స్కూల్లో 13 ఏళ్ల విద్యార్థికి కరోనా సోకింది. దీంతో నోయిడా, ఘజియాబాద్ లలో పలు ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించి, ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు.