మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (11:40 IST)

దేశంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 8,92,828గా నమోదైంది. అటు దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది. 
 
తాజాగా మంగళవారం దేశవ్యాప్తంగా 67, 597 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం 71,365 కేసులు వెలుగుచూశాయి. 
 
అంటే నిన్నటితో పోలిస్తే 4వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976కి పెరిగింది.
 
మరోవైపు మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 1,217 మంది మరణించారు. 
 
మంగళవారం మరణాల సంఖ్య 1,188గా నమోదు కాగా ఈరోజు కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,05,279కి చేరింది.