నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందించిన 'అర్జున్ S/O వైజయంతి' సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేడు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్.టి.ఆర్. హాజరయ్యారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మదర్ అండ్ సన్ డ్రామా తో రూపొందింది.
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లోని సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకున్నాడు. దీంతో అతన్ని తీసుకుని ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు.