మొదట నెగెటివ్... ఇంటికెళ్లాక పాజిటివ్
కరోనా టెస్టుల తీరుపై బెజవాడ పాజిటివ్ పేషేంట్ ఆవేదన వర్ననాతీతం. సెల్ఫీ వీడియో ద్వారా టెస్టుల తీరుపై పాజిటివ్ పేషంట్ సురేంద్ర మాట్లాడిన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో సురేంద్ర మాట్లాడుతూ... లారీ డ్రైవర్‌గా పని చేసే నేను కరోనా లక్షణాలు కనపడటంతో డ్యూటీ నుంచి నేరుగా ఆసుపత్రికి స్వచ్చందంగా వెళ్ళాను.
10 రోజులు ఆసుపత్రిలో ఉంచి రెండుసార్లు స్వాబ్ టెస్టులు చేశారు. నెగెటివ్ వచ్చిందని కృష్ణలంక రామలింగేశ్వర నగర్‌లో ఇంటికి పంపారు. ఒకరోజు ఇంట్లో, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాక అధికారులు పాజిటివ్ వచ్చిందని తీసుకెళ్లారు. ఇలా చేయటం వల్ల నా కుటుంబంతో పాటు మా కాలనీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని వాపోయాడు సురేంద్ర.
అధికారులు ఇలా చేయడం మూలంగా చాలా ఇబ్బందులు వస్తాయని దయచేసి ఇటువంటి ఘటనలు పునరాృతం కాకుండా చూడాలని కోరుతున్నాడు సురేంద్ర.