బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:07 IST)

దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 21,257 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,15,569కి చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇందులో 2,40,221 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,32,25,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,50,127 మంది వైరస్‌ వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 24,963 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడగా, 271 మంది ప్రాణాలు కోల్పోయారు.