శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (13:48 IST)

కొత్తగా బీఏ 4, బీఏ 5 మరో రెండు కరోనా వేరియంట్లు

coronavirus
రెండేళ్ల పాటు ప్రపంచ దేశాలకు కరోనా చుక్కలు చూపించింది. అనేక ప్రాణాలను బలిగొంది. ప్రస్తుతం కరోనాకు వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.
 
ఆల్ఫా, బీటీ, డెల్టా, ఒమిక్రాన్, ప్రస్తుతం ఒమిక్రాన్ ఎక్స్ఈ, ఇలా వరసగా వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ దాటికి ఆదేశంలో నగరాలు లాక్ డౌన్లలోకి వెళ్లాయి. 
 
ఇదిలా ఉంటే మరో రెండు కొత్త వేరియంట్లను గుర్తించారు పరిశోధకులు. ఒమిక్రాన్‌లో మరో రెండు సబ్ వేరియంట్లను దక్షిణాఫ్రికా పరిశోధకులు గుర్తించారు. కొత్తగా బీఏ 4, బీఏ 5 ఓమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు.
 
అయితే ప్రస్తుతానికి తమ దేశంలో ఈ వేరియంట్ల వల్ల కేసులు గానీ, మరణాలు కానీ పెరగలేదని వెల్లడించారు. బోట్స్ వానా, బెల్జియం, డెన్మార్క్, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఈ వేరియంట్లు బయటపడినట్లు చెప్పారు.