శనివారం, 21 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (14:21 IST)

పృథ్వీ షా ఖాతాలో మరో మైలురాయి.. 76 బంతుల్లో 125 పరుగులు

Prithvi Shaw
టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. 76 బంతుల్లో 125 పరుగులు సాధించాడు. తద్వారా నార్తాంప్టన్‌షైర్‌కు మరో సెంచరీని అందించాడు. ఈ క్రమంలో పృథ్వీ షా 3వేల పరుగుల మైలురాయిని కూడా పూర్తి చేశాడు. 
 
ఆదివారం డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున మరో సెంచరీతో భారత బ్యాటర్ తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం 76 బంతుల్లో 125 పరుగులతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 15 ఫోర్లు, ఏడు సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. 164.47 స్ట్రైక్ రేట్ వద్ద పృథ్వీషాకు ఈ పరుగులు వచ్చాయి. 
 
చివరిసారిగా జూలై 2021లో అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన భారత బ్యాటర్ కేవలం 68 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. పృథ్వీ షా రాబ్ కియోగ్ (42)తో కలిసి జట్టుకు కేవలం 25.4 ఓవర్లలో 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడ్డారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డర్హామ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది.