శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (10:01 IST)

ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా.. 20 క్యాచ్‌లతో రిషబ్ పంత్ అదుర్స్

ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ విజయభేరిని మోగించి.. ఈ ఏడాది (2018) సగర్వంగా ముగించింది. ఫలితంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 తేడాతో ముందడుగు వేసింది. ఆదివారం ఉదయం నాలుగో రోజు ఆటకు వరుణుడు కాస్త అంతరాయం కలిగించాడు. అయినా ఆట కొనసాగింది. 
 
399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కుమిన్స్ వికెట్‌ను బూమ్రా తీసుకోగా ఇషాంత్ శర్మ లియాన్‌ను అవుట్  చేశాడు. వీరిద్దరూ 261 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కాగా వికెట్ కీపర్‌గా వున్న రిషబ్ పంత్ ఓ సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న భారత వికెట్ కీపర్‌గా (20 క్యాచ్‌లు) నిలిచాడు. దీంతో భారత్ మూడో టెస్టులో ఘన విజయం సాధించింది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్ సిడ్నీలో జరుగనుండగా, ఈ మ్యాచ్ ఫలితం ఏమైనా.. గవాస్కర్ ట్రోఫీ మాత్రం టీమిండియా చేతుల్లోనే వుంటుంది. 
 
కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లను టీమిండియా గెలవడం ఇది రెండవ సారి. 1977-78లో భారత జట్టు పర్యటించిన వేళ ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లను గెలుచుకుంది. ఆ సిరీస్‌లో మిగిలిన మూడింటిలోనూ భారత్ గెలుపును నమోదు చేసుకుంది.