సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (16:56 IST)

టీ20 వరల్డ్ కప్ : జట్టులో ఎవరెవరికి చోటు దక్కిందంటే...

bcci
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది ఆటగాళ్లతో ఈ జట్టును ప్రకటించింది. అలాగే, మరో నలుగురు ఆటగాళ్లను రిజర్వులో ఉంచింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను, వైస్ కెప్టన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. రిజర్వు ఆటగాడిగా శుభమన్ గిల్‌ను ఎంపిక చేసింది. రిషబ్ పంత్, సంజూ శాంసన్‌‍లు వికెట్ కీపర్లుగా వ్యవహరించనున్నారు. ఈ జట్టులోని వివరాలను పరిశీలిస్తే, 
 
టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యావద్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్ సింగ్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్. 
 
రిజర్వు ఆటగాళ్లు... శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.