వన్డే ప్రపంచకప్ చరిత్రలో రికార్డ్ సృష్టించిన దీప్తి శర్మ, స్మృతి మంధాన.. ఆ రికార్డ్స్ ఏంటి?
deepti sharma smriti mandhana
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత జట్టు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తుదిపోరులో, టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించారు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా మంధాన నిలిచింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఎడిషన్‌లో స్మృతి మంధాన సెకండ్ హయ్యెస్ట్ బ్యాటర్‌గా నిలిచింది. సౌతాఫ్రికా కెప్టెన్ లాలా వోల్వార్డ్ట్ 500 ప్లస్ పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
మరోవైపు ఫైనల్లో హాఫ్ సెంచరీతో రాణించిన దీప్తి శర్మ కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో దీప్తి శర్మ 215 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టింది. దాంతో మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో 200 ప్లస్ పరుగులు చేయడంతో పాటు 15 ప్లస్ వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. మరే ప్లేయర్ కూడా సింగిల్ ఎడిషన్‌లో ఈ ఫీట్ సాధించలేదు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగుల భారీ స్కోర్ చేసింది.