సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:30 IST)

శుభ్‌మన్ గిల్‌పై భజ్జీ కామెంట్స్.. పృథ్వీ షా కంటే ఇతనే బెటర్

శుభ్‌మన్ గిల్‌పై టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కామెంట్లు చేశాడు. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో పృథ్వీషా కంటే శుభ్‌మన్ గిల్ బెటరని భజ్జీ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఇండియా ఎ సిరీస్‌లో అద్భుతంగా ఆడిన శుభమన్ టెస్టులకు తాను సిద్ధమనే విషయాన్ని నిరూపించుకున్నాడని తెలిపాడు. లాండ్‌ ‘ఎ’తో నాలుగు రోజుల మొదటి టెస్ట్‌లో మిడిలార్డర్‌లో వచ్చిన గిల్‌ 83, 204 (నాటౌట్‌) పరుగులు సాధించాడు. 
 
అలాగే రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శుభ్‌మన్‌ సెంచరీ చేశాడు. మరోవైపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ జట్టులో పునరాగమనం చేసిన షా కూడా తుది 11 మందిలో స్థానం కోసం పోటీలో ఉన్నాడు. 
 
కాగా వెస్టిండీస్-ఎతో అంటిగ్వాలో నిర్వహించిన అనధికార వన్డే సిరీస్‌లోనూ శుభమన్ గిల్ అద్భుతంగా రాణించాడు. ఈ వన్డే సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును గెలుచుకున్నాడు.