శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (11:18 IST)

కొడుకుపై తన ప్రేమ మాటలకందని భావోద్వేగ... వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా!!

hardik - natasha
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. తాజాగా తన కుమారుడు అగస్త్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు. ఈ వేడుకల వీడియోను షేర్ చేసాడు. 'నీపై నాకున్న ఆపేక్ష మాటలకందనిది' అంటూ భావోద్వేగ పూరిత కామెంట్ చేశాడు. హార్దిక్ కుమారుడు తాజాగా తన నాల్గవ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ తన కుమారుడిని చూసి మురిసిపోయాడు. చిన్నారిని చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. అగస్త్య కూడా తండ్రిని అనుకరిస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. ఈ తండ్రీతనయుల వీడియో జనాలకు కూడా బాగా నచ్చడంతో లక్షల కొద్దీ వ్యూస్, వేల కొద్దీ కామెంట్స్ వచ్చి పడ్డాయి. హార్దిక్ ఓ అదర్శవంతమైన తండ్రి అని కొందరు అన్నారు. పలువురు చిన్నారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. 
 
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ ఇటీవలే తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. 2020లో ఈ జంటకు పెళ్లి కాగా, ఆ తర్వాత వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తాజాగా వారు తమ నాలుగేళ్ల దాంపత్య బంధానికి ముగింపు పలుకుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇదిలావుంటే, నటాషా కూడా ఈ మధ్య కాలంలో తన కుమారుడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను నెట్టింట పంచుకుంది. ఇటీవల తల్లీకొడుకు ఓ డైనోసార్ థీమ్ పార్క్‌ను సందర్శించిన సందర్భంగా తీసిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.