సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (08:52 IST)

నా అల్లుడు చాలా మంచోడు.. మహ్మద్ షమీ మామ

కట్టుకున్న భార్య హసీన్ జహాన్ మాత్రం తన భర్తపై లేనిపోని ఆరోపణలు చేసింది. ముఖ్యంగా, తన భర్త స్త్రీలోలుడని, పలువురు అమ్మాయిలతో సంబంధం ఉందనీ, మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడుతుంటాడని పేర్కొంది.

కట్టుకున్న భార్య హసీన్ జహాన్ మాత్రం తన భర్తపై లేనిపోని ఆరోపణలు చేసింది. ముఖ్యంగా, తన భర్త స్త్రీలోలుడని, పలువురు అమ్మాయిలతో సంబంధం ఉందనీ, మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడుతుంటాడని పేర్కొంది. కానీ, జహాన్ తండ్రి మహ్మద్ హుస్సేన్ మాత్రం అల్లుడు షమీకి క్లీన్ చిట్ ఇచ్చారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, షమీ చాలా మంచి వ్యక్తి అని అన్నారు. ఆయన తప్పుచేశాడంటే తాను నమ్మలేకున్నానని తెలిపారు. షమీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. షమీ చాలా తక్కువ మాట్లాడుతాడని చెప్పారు. 
 
తన అల్లుడు, కుమార్తె మధ్య వివాదం చర్చలతో పరిష్కారమవుతుందన్నారు. దీనికి తన కుమార్తె కూడా అనుకూలంగా ఉందని ఆయన వెల్లడించారు. కాగా, షమీపై 498 (ఏ), 323, 307, 376, 506, 328 సెక్షన్ల కింద అతని భార్య హసీన్ జహాన్ కేసులు నమోదు చేయించిన సంగతి తెలిసిందే.