1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 29 జులై 2015 (06:54 IST)

ఆ అవమానం భరించలేకపోయా...! ఆత్మహత్య చేసుకుందామనిపించింది..!?

చేయని తప్పునకు ఎన్నో అవమానాలు పడ్డాం.. మనసు చాలా గాయపడింది. జైలు కెళ్లాం.. తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఇన్ని నిందలు మోసే ఈ బతుకు ఎందుకనిపించిందని, ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని క్రికెటర్ శ్రీశాంత్ తెలిపాడు. అది పిరికివాడి లక్షణమని  తనను తాను ఓదార్చుకున్నట్లు వివరించారు. స్పాట్ ఫిక్సింగ్ మచ్చ తొలగిపోవడంతో కొచ్చిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 
 
బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అపాయింట్‌మెంట్ కోరానని తెలిపాడు. తనపై బీసీసీఐ సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అరెస్టు చేసినప్పుడు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదని శ్రీశాంత్ తెలిపాడు. శివారాధనతోనే తాను ప్రశాంతంగా ఉండగలిగానని ఆయన చెప్పాడు. 
 
స్పాట్ ఫిక్సింగ్ మచ్చ తొలగిపోవడంతో తనపై విధించిన జీవితకాల నిషేధం ఎత్తివేయాలని కోరనున్నానని శ్రీ చెప్పాడు. తనపై నిషేధం ఎత్తివేయగానే ప్రాక్టీస్ ప్రారంభిస్తానని శ్రీశాంత్ తెలిపాడు. ‌తిరిగి జట్టులో స్థానం సంపాదించగలనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.