ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (19:47 IST)

భద్రతని ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించిన అభిమాని..

Rohit sharma
Rohit sharma
తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం రాత్రి జరిగిన మొదటి టీ20 సందర్భంగా ఒక అభిమాని భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. క్రికెటర్ రోహిత్ శర్మ కోసం ఓ అభిమాని భద్రతని ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. 
 
భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకాడు. భారత్ ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్లతో తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 స్కోరు మాత్రమే చేసింది.