1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 19 మార్చి 2015 (09:48 IST)

భారత్ Vs బంగ్లాదేశ్ : 10 ఓవర్లలో వికెట్ పడకుండా 51 రన్స్...

ఇంతవరకు జరిగిన ఆరు ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లలో జైత్రయాత్ర సాగిస్తూ వచ్చిన భారత్ మెల్‌బోర్న్‌ వేదికగా గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచుతున్నారు. 
 
తొలి పది ఓవర్లలో భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ 24, శిఖర్ ధావన్ 21 పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో ఐదు పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్‌ తొలి బంతిని బౌండరీకి తరలించిన రోహిత్.. ఆ తర్వాత నాలుగు ఫోర్లు కొట్టగా, శిఖర్ ధావన్ మూడు ఫోర్లు కొట్టాడు. 
 
ఇరు జట్ల వివరాలు..
భారత్ : ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రహానే, సురేష్ రైనా, ధోనీ, జడేజా, అశ్విన్, షమీ, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్. 
 
బంగ్లాదేశ్ : తమీమ్ ఇక్బాల్, ఇమ్రూల్ కాయీస్, సర్కార్, మహ్మదుల్లా, షాకిబ్ అల్ హాసన్, రహీమ్, సబ్బీర్ రెహ్మాన్, నాసిర్ హుస్సేన్, మోర్తాజా, హోస్సేన్, తస్కిన్ అహ్మెద్.