ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Modified: శనివారం, 2 మార్చి 2019 (21:42 IST)

హైదరాబాదులో మరోసారి 'ధోని'జమ్... ఆసీస్ పై టీమిండియా ఘన విజయం

హైదరాబాదులో మరోసారి 'ధోని'జమ్‌ను చూశారు క్రికెట్ క్రీడాభిమానులు. నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును ధోనీ విజయ తీరాలకు చేర్చాడు. 237 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు 81 పరగుల వద్ద వరుస షాకులు ఇచ్చారు ఆసీస్ ఆటగాళ్లు. 
 
కోహ్లి ఎల్‌బి డబ్ల్యుగా వెనుదిరగడంతో ఇక ఆ తర్వాత రోహిత్ (37), రాయుడు(12)ను పెవిలియన్ ముఖం పట్టాల్సి వచ్చింది. దాంతో 99 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో ధోనీ, జాదవ్ ఆదుకున్నారు. అర్థ శతకాలతో ఇద్దరూ విజయానికి బాటలు వేశారు. కాగా ధోనీ వన్డేల్లో 71వ హాఫ్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. మొత్తమ్మీద ధోనీ ఆటతీరు హైదరాబాదులో కనువిందు చేసింది. ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.