మంగళవారం, 28 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (18:01 IST)

హార్దిక్ పాండ్యా అవుట్.. రవీంద్ర జడేజా ఇన్

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గతేడాది ఓ టీవీ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కొన్ని మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటన చివర్లో మళ్లీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు వన్డేల సిరీస్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. 
 
పాండ్యా వెన్నెముక గాయంతో బాధపడుతున్నాడు. అతడికి రెస్ట్ అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. వెన్నెముక బలపడేంత వరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతను ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడు. వచ్చేవారం నుంచి శిక్షణ మొదలవుతుంది. వన్డే సీరీస్‌తో పాటు టీ20 సిరీస్‌కు కూడా పాండ్యా దూరం కానున్నాడు. ప్రస్తుతానికి మాత్రం రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం కల్పించారు. ఇప్పుడు టీమిండియా టీ20 జట్టులో 14 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.