సోమవారం, 13 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (16:18 IST)

ఎడ్‌బాస్టన్ టెస్ట్ : రెండో రోజు రెండు పరుగులే.. ఇంగ్లండ్ 287 ఆలౌట్

ఎడ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌట్ అయింది. తొలిరోజు ఓవర్ నైట్ స్కోరు 285కు మరో రెండు పరుగులు జోడించిన తర్వాత చివ

ఎడ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌట్ అయింది. తొలిరోజు ఓవర్ నైట్ స్కోరు 285కు మరో రెండు పరుగులు జోడించిన తర్వాత చివరి వికెట్‌ను కోల్పోయింది. ఈ వికెట్‌ను షమీ పడగొట్టాడు.
 
తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రూట్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెయిర్‌స్టో 70 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించినా.. రూట్ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి సెషన్‌లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 
 
దీంతో తొలి రోజు ఓవరాల్‌గా ఇండియా పైచేయి సాధించింది. భారత బౌలర్లలో అశ్విన్ 4, షమి 3, ఉమేష్, ఇషాంత్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.