1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. India vs Pakistan Highlights U19 Asia Cup Final

అండర్-19 ఆసియా కప్ 2025 : కీలక పోరులో తడబడి ఓడిన భారత్

pakistan under 19 team
అండర్-19 ఆసియా కప్ 2025 క్రికెట్ పోటీల్లో భాగంగా, ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ తడబడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో పూర్తిగా నిరాశపరిచారు. ఫలితంగా భారత్ 191 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 348 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత యువ జట్టు 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. పదో స్థానంలో వచ్చిన దీపేశ్‌ దేవేంద్రన్ (36) టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.
 
ఒక దశలో 120 పరుగులకే భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోగా.. దీపేశ్‌ పోరాటంతో స్కోరు 150 దాటింది. వైభవ్ సూర్యవంశీ (26), ఖిలాన్ పటేల్ (19), ఆరోన్ జార్జ్ (16), అభిజ్ఞాన్ కుందు (13), వేదాంత్ త్రివేది (9), కాన్షిక్ చౌహాన్ (9), విహాన్ మల్హోత్రా (7), హెనిల్ పటేల్ (6), ఆయుష్‌ మాత్రే (2), కిషన్ కుమార్ సింగ్ (3*) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అలీ రజా 4, మహ్మద్ సయామ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా అహ్సాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.
 
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ శతకం చేశాడు. అహ్మద్ హుస్సేన్ (56; 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ చేశాడు. ఉస్మాన్ ఖాన్ (35), ఫర్హాన్ యూసుఫ్‌ (19), హంజా జహూర్ (18) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్ 3, హెనిల్ పటేల్ 2, ఖిలాన్ పటేల్ 2, కాన్షిక్ చౌహాన్ ఒక వికెట్ తీశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Smriti Mandhana: అంతర్జాతీయ క్రికెట్‌లో 4,000 పరుగులు చేసిన స్మృతి మంధాన