గురువారం, 14 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 12 జులై 2018 (11:08 IST)

వన్డే సమరం : నేడు ఇంగ్లండ్ - భారత్ ఫస్ట్ వన్డే

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి వన్డే టోర్నీ ఆడనుంది. ఈ టోర్నీకి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌‌లో భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుని సమరోత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి వన్డే టోర్నీ ఆడనుంది. ఈ టోర్నీకి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌‌లో భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుని సమరోత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లోనూ విజయభేరీ మోగించి టైటిల్‌ను అందుకోవాలని భారత కుర్రోళ్లు ఉవ్విళ్ళూరుతున్నారు.
 
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాటింగ్ హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆడటం, అద్భుతమైన ఫామ్ ఇంగ్లండ్‌కు బలమైతే… టీ20 సిరీస్ గెలిచిన జోరుపై కోహ్లీ సేన వుంది. వన్డే సిరీస్‌నూ కైవసం చేసుకోవాలని చూస్తోంది. సిరీస్ గెలిచి వన్డేల్లో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. 
 
2015 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్ ఆడిన 69 మ్యాచ్‌ల్లో 31సార్లు 300లకు పైగా స్కోర్లు సాధించింది. ఇందులో 23 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 11సార్లు 350 పరుగులను అధిగమించింది. మూడుసార్లు 400ల స్కోరును కూడా చేసింది. కాబట్టి ఈ సిరీస్ భారత్‌కు అనుకున్నంత సులువేంకాదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. 
 
ఇరు జట్లు (అంచనా)
 
భారత్: కోహ్లీ (కెప్టెన్), ధవన్, రోహిత్, రాహుల్, రైనా లేదా కార్తీక్, ధోనీ, హార్దిక్, కుల్దీప్, చాహల్, ఉమేశ్, భువనేశ్వర్ లేదా శార్దూల్ ఠాకూర్.
 
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, బట్లర్, అలీ, విల్లే, ఫ్లంకెట్, రషీద్, ఉడ్ లేదా బాల్.
 
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలం. పరుగుల వరద ఖాయం. ఇదే వేదికపై ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే ఆ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌ను వాడటం లేదు. వర్షం ముప్పు లేదు.