గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (09:34 IST)

దాయాదుల పోరు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

indo - pakistan
భారత్-పాకిస్థాన్ మధ్య దాయాదుల పోరు జరుగనుంది. క్రికెట్ అభిమానులకు ఈ వార్త మస్తు మజా ఇవ్వనుంది. అక్టోబరు 5 నుంచి భారత్‌లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబరు 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు జనం ఎగబడుతున్నారు. 
 
ఈ సూపర్ మ్యాచ్ కోసం నిన్న టికెట్లను అందుబాటులోకి తీసుకురాగా, కేవలం గంటలోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు బుక్ మై షో ద్వారా ఆన్ లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. 
 
మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు బుక్ మై షో ద్వారా ఆన్ లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. 7 గంటల తర్వాత ఒక్క టికెట్ కూడా మిగల్లేదు. సెప్టెంబరు 3న మరోసారి టికెట్ల అమ్మకం ఉంటుందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.