సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (19:43 IST)

వ‌న్డే ఫార్మాట్‌లో 300 విజ‌యాలు.. టీమిండియాకు అరుదైన గుర్తింపు

team india
అంత‌ర్జాతీయ వ‌న్డే ఫార్మాట్‌లో 300 విజ‌యాల‌ను సాధించిన జ‌ట్టుగా టీమిండియాకు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఇప్ప‌టికే ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్టుగా గుర్తింపు పొందిన టీమిండియా టీమిండియా... ఆదివారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో విజ‌యంతో '300' విక్ట‌రీ మార్కును అందుకుంది.
 
ఈ ఫార్మాట్‌లో అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్టుగా టీమిండియా కొన‌సాగుతుండ‌గా... 257 విజ‌యాల‌తో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, 247 విజ‌యాల‌తో వెస్టిండీస్ మూడో స్థానంలో కొన‌సాగుతున్నాయి.