సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (19:17 IST)

147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కివీస్ అదుర్స్.. భారత్ కుదేలు

Kiwis
Kiwis
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న కివీస్ చరిత్ర సృష్టించింది. పుణె వేదికగా శనివారం ముగిసిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ 113 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 359 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.
 
ఈ గెలుపుతో న్యూజిలాండ్ 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మరోవైపు భారత్ 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయింది. 2012లో చివరి సారిగా ధోనీ సారథ్యంలోని టీమిండియా.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా 18 టెస్ట్ సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. తాజా సిరీస్‌లో మాత్రం ఖంగుతింది.
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలింది. 103 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. 359 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.
 
యశస్వి జైస్వాల్ (65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా (84 బంతుల్లో 2 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(6/104) ఆరు వికెట్లతో మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. ఆజామ్ పటేల్‌కు రెండు వికెట్లు దక్కగా.. గ్లేన్ ఫిలిప్స్‌కు ఓ వికెట్ దక్కింది.