బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (08:57 IST)

మోడల్‌గా మారిన సారా టెండూల్కర్... ప్రోమో వైరల్

Sara Tendulkar
భారత స్టార్ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మోడల్‌గా అవతారం ఎత్తారు. ఓ ప్రముఖ దుస్తుల బ్రాండ్‌కు మోడలింగ్ చేసింది. ఈ దుస్తుల కోసం బనితా సంధు, తాన్యా ష్రాఫ్ వంటి తారలతో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఓ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
 
సారా టెండూల్కర్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. సారా క్రమం తప్పకుండా ఫొటోలు, అప్‌డేట్లను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో సారా మోడలింగ్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
సారా ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. ఆపై ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడి లండన్ యూనివర్సిటీ కాలేజీలో వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
 
తల్లి అంజలి కూడా వైద్యురాలే కావడంతో సారా కూడా ఆమె బాటలోనే వైద్య వృత్తిని ఎంచుకుంది. అంతేకాదు, సచిన్ తనయ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. సోషల్ మీడియాలో తన ఫిట్‌నెస్ వర్కౌట్లకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్టు చేస్తుంటుంది.