1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2015 (15:55 IST)

సంగక్కర డేంజర్ మ్యాన్.. అదే సంగా స్పెషాలిటీ: సచిన్ టెండూల్కర్

లంక బ్యాటింగ్ లెజెండ్ కుమార్ సంగక్కర రిటైర్మెంట్ ప్రకటింనున్న సంగతి తెలిసిందే. మామూలుగా ఎడమచేతి వాటం ఆటగాళ్ల బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది. అయితే తాను ప్రత్యర్థి జట్టులో ఉండటంతో సహజంగానే అతడి ఆటను ఆస్వాదించలేకపోయాను. సంగక్కరకు ప్రత్యర్థిగా ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎప్పుడు లంకతో ఆడినా, అతడు డేంజర్ మ్యాన్‌గా కనిపించేవాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.
 
ఓ క్రికెటర్‌గా సంగక్కర ప్రస్థానం అద్భుతమని, కెరీర్ తొలినాళ్లలో విధ్వంసకర బ్యాటింగ్ చేయలేకపోయినా.. తర్వాత బ్యాట్ ఝుళిపించడం ద్వారా పరుగులు వెల్లువెత్తించాడని సచిన్ చెప్పుకొచ్చాడు. "అనుభవం పెరిగేకొద్దీ వన్నె తేలాడు. ప్రపంచ స్థాయి క్రికెటర్ అనేందుకు అదే సూచిక. లంకేయులకే కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అతడు ఎందరో యువకులకు ఆదర్శప్రాయుడు'' అని సచిన్ కొనియాడాడు. 
 
అంతేగాకుండా.. సంగాలో ఓ ప్రత్యేకత ఉంది. అదే అతడిని ప్రమాదకరంగా మార్చిందనుకుంటా. క్రీజులో అసౌకర్యంగా కదులుతున్న సమయంలోనూ పరుగులు రాబట్టగల సామర్థ్యం అతడి సొంతం. అదే సంగా స్పెషాలిటీ. పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకోవడంలో దిట్ట" అని కితాబిచ్చారు.