శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (16:30 IST)

జాగ్రత్తగా డ్రైవ్ చేయమని అప్పుడే శిఖర్ ధావన్ చెప్పాడు...

shikhar dhawan
ప్రముఖ భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ సమీపంలోని రూర్కీలో కారు నడుపుతుండగా, కారు అదుపు తప్పి బారికేడ్‌ను ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ సందర్భంలో, రిషబ్ పంత్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. ఐసీయూ చికిత్స పొందుతూ.. క్రిటికల్ స్టేజ్ దాటాడు. 
 
ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం, శిఖర్ ధావన్ రిషబ్ పంత్‌కు సలహా ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిషబ్ పంత్ "నాకు కొంత సలహా ఇవ్వండి" అని అడిగాడు. దాని గురించి కూడా ఆలోచించకుండా, "నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి" అని ధావన్ చెప్పాడు. 
 
ఈ సలహా నిజం అన్నట్లే ప్రస్తుతం జరిగిన ఈ కారు ప్రమాదాన్ని బట్టి తెలుస్తోంది. రోడ్డుపై మంచు కురుస్తుండటం, రిషబ్ పంత్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు.