గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (16:30 IST)

జనవరి 1న విరాట్ కోహ్లీ - అనుష్కల నిశ్చితార్థం?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ తార అనుష్క శర్మల వివాహ నిశ్చితార్థం జనవరి ఒకటో తేదీన జరుగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో వీరిద్దరూ కుటుంబాలతో కలిసి పర్యటనలో

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ తార అనుష్క శర్మల వివాహ నిశ్చితార్థం జనవరి ఒకటో తేదీన జరుగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో వీరిద్దరూ కుటుంబాలతో కలిసి పర్యటనలో ఉన్నారు. అక్కడి నరేంద్ర నగర్‌లోని ఆనంద హోటల్‌లో ఆదివారం వీరిద్దరి నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నిశ్చితార్థ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌, అంబానీ, కపూర్ల కుటుంబాలతో పాటు బాలీవుడ్‌, క్రికెట్‌ ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు టాక్‌. అనుష్క స్నేహితులు, కుటుంబీకులు వేడుకకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వినికిడి. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా వరుడు - వధువు ప్రకటించలేదు. 
 
కానీ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు ఈ పుకార్లకు వూతమిచ్చినట్లుగా ఉన్నాయి. ఇద్దరూ కలిసే ఫొటోలు దిగకపోయినా విరాట్‌, అనుష్కలు ఒకే రకమైన రుద్రాక్ష గొలుసు వేసుకుని దిగిన ఫొటోలు పోస్ట్‌ చేశారు.