Virat Kohli: మౌనం వీడిన విరాట్ కోహ్లీ.. బెంగళూరు తొక్కిసలాటపై కింగ్ మాటలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన అనంతరం ఇంగ్లండ్ వెళ్లిపోయిన కోహ్లీ.. తాజాగా విచారం వ్యక్తం చేశాడు. జూన్ 4న హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.
జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణం విషాదంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాల కోసం, గాయపడిన వారికి కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాం వారి కోసం ప్రార్థిస్తున్నాం.
మీకు కలిగిన నష్టం మాలో భాగం. ఇక నుంచి జాగ్రత్తగా.. గౌరవంగా, మరింత బాధ్యతతో కలిసికట్టుగా ముందుకు సాగుదాం.'అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను ఆర్‌సీబీ షేర్ చేసింది.