శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 నవంబరు 2023 (22:34 IST)

ఆడుతూ పాడుతూ ఆసీస్ వచ్చేసింది ఫైనల్‌కి, భారత్‌తో 19న ఢీ

australia team
బ్యాటింగ్ ఎంచుకుని ఆస్ట్రేలియా జట్టు ముందు భారీ లక్ష్యాన్ని వుంచాలని చతికిలపడింది దక్షిణాఫ్రికా. ఆదిలోనే టపటపా వికెట్లను పారేసుకుని 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఆటగాళ్లు ఆడుతూపాడుతూ బాదేసారు. మరో 16 బంతులు మిగిలి వుండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం నాడు నవంబర్ 19న టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడుతుంది.
 
213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు ట్రవిస్-డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడారు. ట్రవిస్ 62 పరుగులు, డేవిడ్ వార్నర్ 29 పరుగులు చేసారు. ఆరంభంలో గట్టి పునాది వేయడంతో ఆ తర్వాత వచ్చినవారికి లక్ష్య ఛేదన చాలా తేలికగా మారింది. మార్ష్ డకౌట్ అయ్యాడు. స్మిత్ 30, మార్నస్ 18, మాక్స్‌వెల్ 1, జోష్ 28, మిచెల్ స్టార్క్ 16 నాటౌట్, పాట్ కమిన్స్ 14 నాటౌట్‌గా నిలిచారు.