1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Ganesh
Last Updated : గురువారం, 12 జూన్ 2014 (16:04 IST)

ఫోర్బ్స్ జాబితాలో ధోనీ.. 174 కోట్ల ఆదాయం!

భారత కెప్టెన్ కూల్ ధోని పరుగలు సాధించడంలోనే కాదు. డబ్బు సంపాదించడంలో కూడా రికార్డు సాధిస్తున్నాడు. ప్రపంచ క్రీడాకారుల్లో అత్యంత ధనవంతుడిగా భారత్ తరపున ధోని ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. అత్యధికంగా సంపాదిస్తున్న 100 మంది క్రీడాకారుల్లో ధోని 22వ స్థానంలో నిలిచాడు.

మొత్తం 174 కోట్ల ఆదాయం, మరో 150 కోట్ల రూపాయల మొత్తానికి సరిపడా ఒప్పందాలతో ధోని ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచాడు. ధోనీ జీతం, గెలుచుకున్న బహుమతుల విలువ మొత్తం జూన్ నాటికి 232 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.