శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 16 జూన్ 2017 (03:57 IST)

ఇలాంటివాళ్లు టీమ్‌లో ఉంటే ఏమైనా సాధించవచ్చు.. భువి, బూమ్రాలపై కోహ్లీ ప్రశంసల వర్షం

ఒకటి మాత్రం నిజం. టీమిండియా ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడి ఉందంటే భారత్ల బౌలింగ్ తురుపుముక్కలు భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకే ఆ ఘనత దక్కుతుందని టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఒకటి మాత్రం నిజం. టీమిండియా ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడి ఉందంటే భారత్ల బౌలింగ్ తురుపుముక్కలు భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకే ఆ ఘనత దక్కుతుందని టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. గురువారం టాస్ గెలిచి  ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ బంగ్లా జట్టు కీలక బ్యాట్స్‌మన్ తమిమ్, ముష్ఫికర్ నిలకడగా ఆడుతూ భారీ స్కోరువైపుకు సాగుతున్న స్థితిలో కేదార్ జాదల్ ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను వెనక్కు పంపించిన ఘటన మొత్తం ఆటకు పెనుమలుపుగా నిలిచింది.

అదేసమయంలో టీమిండియాకు అనేక సంక్లిష్ట సమయాల్లో వెన్నుదన్నుగా నిలిచిన భువి, బుమ్రాల బౌలింగ్ తీరు అనితరసాధ్యం అంటూ కోహ్లీ పొగిడేశాడు. ప్రత్యేకించి గత రెండు మ్యాచ్‌లలో అంటే దక్షిణాఫ్రికా, బంగ్లా జట్లతో పోటీలో ఈ ఇద్దరి బౌలింగ్ బీభత్సంగా ఉందని కోహ్లీ కొనియాడాడు. 
 
అననుకూల పరిస్థితుల్లో కూడా వికెట్లను తీయడంలో ఈ ఇద్దరి సమర్థత ఏమిటో ప్రత్యర్థి జట్లకు బాగా తెలుసు. అందుకే ఆరితేరిన బ్యాట్స్‌మెన్ కూడా వీరిద్దరి బౌలింగులో దూకుడుతనం ప్రదర్శించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. శ్రీలంకతో ఓటమి తర్వాత వీరిద్దరూ పాటించిన లైన్ అండ్ లెంగ్త్ విధానం అద్భుతంగా ఉంది. బ్యాట్స్‌మెన్‌కు దగ్గరగా బంతులు వేస్తూ లైన్ తప్పకుండా ఈ ఇద్దరూ బంతిని సంధించే తీరు వికెట్‌ను నేరుగా గురిపెట్టుతుంది. బౌలింగ్‌కు అంత అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా వీరు పాటించే లైన్ అండ్ లెంగ్త్ వల్లే అనేక సార్లు వికెట్ తీసే అవకాశాలు టీమిండియాకు దక్కాయని కోహ్లీ చెప్పాడు.
 
పార్ట్ టైమ్ బౌలర్‌గా కేదార్ జాదవ్ బంగ్లాదేశ్ నడ్డి విరిచాక, బంగ్లా జట్టు బ్యాటింగును భువనేశ్వర్, బుమ్రా అసాధారణ రీతిలో అడ్డుకున్నారు. చివరి ఓవర్లలో బంగ్లా జట్టు హిట్టర్లను వీరు అడ్డుకున్న తీరు అమోఘం అనే చెప్పాలి. కేదార్ షాక్‌తో పడిపోయిన బంగ్లా జట్టు రన్ రేట్ భువి, బుమ్రా పొదుపరి బౌలింగుతో కనీసం 75 పరుగులను కోల్పోయి ఏడు వికెట్లకు 264 పరుగులు మాత్రమే చేయగలిగింది.