గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (19:35 IST)

క్రికెట్ ప్రేమికుల కోసం బీబీసీ ప్రపంచ కప్ ప్రత్యేక కవరేజ్

అంతర్జాతీయ మీడియా సంస్థల్లో అగ్రగామిగా ఉన్న బీబీసీ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగనున్న క్రికెట్ వరల్డ్ కప్ 2019 పోటీలను ప్రత్యేకంగా కవరేజ్ చేయనుంది. ముఖ్యంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ కోసం ఈ ప్రసారాలను టెలికాస్ట్ చేయనుంది. ప్రస్తుతం బీబీసీ ఆధ్వర్యంలో బంగ్లా, హిందీ, మరాఠీ, పాష్తో, సింహాళ, తమిళ, ఉర్దూ భాషల్లో ప్రసారమవుతుండగా, కొత్తగా మరికొన్ని భాషల్లో ప్రసారం చేయనుంది. బ్రిటన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల కోసం ఈ మెగాటోర్నీ మొత్తాన్ని కవరేజ్ చేయనుంది. భారత్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు వీలుగా ఈ కవరేజ్ ఏర్పాట్లు చేశారు.
 
ఇదే అంశంపై వరల్డ్ సర్వీసెస్ లాంగ్వేజెస్ స్పోర్ట్స్ ఎడిటర్ బెన్ సదర్లాండ్ స్పందిస్తూ, పాకిస్థాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలను వరల్డ్ సర్వీసెస్ ఆసియన్ లాంగ్వేజెస్‌లలో అద్భుతమైన కవరేజి ఇచ్చినట్టు చెప్పారు. లోతైన, విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా, క్రీడా నేపథ్యం ఉన్న ప్రతినిధులు ఈ వార్తా కథనాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇపుడు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ప్రారంభమైన క్రికెట్ వరల్డ్ కప్ పోటీలపై ప్రత్యేక కవరేజ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ వేసవికాలంలో మహిళా వరల్డ్ కప్, ఆఫ్రికన్ నేషన్స్ కప్, వింబుల్డన్ టోర్నీల కవరేజ్‌లో బీబీసీ భాగస్వామ్యమై ఉందని పేర్కొన్నారు.
 
ఈ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి ఆయా ప్రాంతీయ భాషల క్రీడా పండితులైన వినాయక్ గైక్వాడ్, శివకుమార్ ఉలగనాథన్, నితిన్ శ్రీవాత్సవ వంటి వారు ప్రత్యేక కథనాలు రాస్తారని తెలిపారు. ముఖ్యంగా వరల్డ‌్‌లో భారత్ అడే అన్ని మ్యాచ్‌లకు సంబంధించి ప్రత్యేక కవరేజ్ ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా, బీబీసీ హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తమిళం, తెలుగు భాషల్లో మ్యాచ్ విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు, ఫేస్‌బుక్ లైవ్స్ వంటివి ఉంటాయని వెల్లడించారు. సోలీ ఆడమ్స్, సచిన్ టెండూల్కర్‌తో ప్రత్యేక కార్యక్రమాన్ని గగన్ సభర్వాల్ నిర్వహిస్తారని తెలిపారు. 
 
అలాగే, 30 రోజుల పాటు బీబీసీ న్యూస్ ఆఫ్గన్‌లో వరల్డ్ కప్‌కు సంబంధించిన ఓ ప్రశ్నతో కూడిన ఫోటోను పోస్ట్ చేసి, సమాధానాన్ని సాయంత్రం వెల్లడిస్తామన్నారు. ఈ ప్రపంచ కప్‌లో కేవలం ప్రత్యేక కథనాలు, లైవ్ కవరేజస్ మాత్రమే కాకుండా ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఉంటాయని వెల్లడించారు. బీబీసీ న్యూస్ ఆఫ్రికా వీక్షకులపై ప్రత్యేక కథనాలను ప్రచురిస్తే, బీబీసీ న్యూస్ ఉర్దూ, బీబీసీ బంగ్లాలు ప్రత్యేక కథనాలను ప్రచురిస్తాయని ఆయన వివరించారు. కాగా, బీబీసీ వరలడ్ సర్వీసెస్ ఇంగ్లీషుతో పాటు 41 ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను అందిస్తూ వస్తోంది.