సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (11:34 IST)

క్రిస్ గేల్‌కు భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఫీవర్

క్రికెట్ ప్రేమికలకు ఇపుడు భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఫీవర్ పట్టుకుంది. ఇది చిన్న వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్‌కు కూడా పాకింది. దీంతో ఆయన సగం ఇండియా, సగం పాకిస్థాన్‌ను తలపించేలా దుస్తులు ధరించాడు. ఆ తర్వాత ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రపంచ క్రికెట్ పోటీల్లో భాగంగా, ఆదివారం భారత్ పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య అత్యంత కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ అంటే ఓ మహాసంగ్రామంగా క్రికెట్ అభిమానులు భావిస్తారు. 
 
ఇందులోభాగంగా, ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం అభిమానులతో పాటు క్రికెట్‌ ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇక ఈ ఫీవర్ వెస్టిండీస్‌ స్టార్ క్రికెటర్ క్రిస్‌ గేల్‌‌నూ పట్టుకుంది. ఇండియా, పాక్ మ్యాచ్ నేపథ్యంలో ప్రత్యేకమైన డ్రెస్‌‌తో తయారు చేయించుకుని, దాన్ని ధరించి ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో పెట్టాడు. గేల్ తాజా చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. 
 
కుడి వైపు భారత పతాకంలోని మూడు రంగులు, ఎడమ వైపు పాక్‌ జెండా రంగైన ఆకుపచ్చ రంగుతో ఈ డ్రస్ కనిపిస్తోంది. తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 20న తేదీన కూడా ఇవే దుస్తులను తాను ధరిస్తానని క్యాప్షన్ పెడుతూ, గేల్ ఈ ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. కాగా, ఐపీఎల్‌‌తో పాటు ఐసీఎల్‌‌లనూ ఆడుతున్న గేల్‌‌కు రెండు దేశాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే.