బర్మింగ్‌హామ్ మ్యాచ్ : నిలకడగా భారత బ్యాటింగ్.... సెంచరీల దిశగా ఓపెనర్లు
ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయానికి అనుగుణంగా మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్నారు.
ముఖ్యంగా, రోహిత్ శర్మ ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేయగా, ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన కేఎల్ రాహుల్ కూడా ఓవర్లు గడిచేకొద్దీ బాదుడు షురూ చేశాడు. ఓపెనర్లిద్దరూ స్వేచ్ఛగా డుతుండటంతో స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది.
ప్రస్తుతం భారత స్కోరు 22 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 140 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ 81, కేఎల్ రాహుల్ 62 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ 4 సిక్స్‌లు, ఆరు ఫోర్లు కొడితే రాహుల్ ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.