శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (14:08 IST)

ఖమ్మంలో తెరాస నేత దారుణ హత్య

murder
ఖమ్మం జిల్లాలో తెరాస నేత దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి శివారులో పార్టీ నేత కృష్ణయ్యపై ఐదుగురు దుండగులు దాడి చేశారు. వేటకొడవళ్లతో ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన.. అక్కడే చనిపోయారు.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హత్యా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... హత్యకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 
 
కాగా, మృతుడు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అలాగే, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టరుగా పని చేస్తున్నారు.