సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2019 (21:26 IST)

హనీ ట్రాప్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నేతలు.. ఎవరు?

పిండికొద్దీ రొట్టె, అవసరం కొద్దీ సుఖం.. ఆశకొద్దీ డబ్బు అన్న చందంగా సాగింది హనీట్రాప్ బిజినెస్. మగాళ్ళ చేతిలో ఆడవాళ్ళు మోసపోయారని విన్నాం. అయితే నలుగురు మహిళల చేతిలో పేరున్న లీడర్స్ అడ్డంగా చిక్కారు. ఇది అలాంటి.. ఇలాంటి సెక్స్ రాకెట్ కాదు.

వేలమందిని తమ తిప్పుకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్న అతిపెద్ద సెక్స్ ర్యాకెట్. సింపుల్‌గా చెప్పాలంటే హనీట్రాప్. సాధారణంగా ఇలాంటి పదాలను దేశ సైనికులు అమ్మాయిలను ఎరవేసినప్పుడు హనీ ట్రాప్ అని చెబుతుంటాం. కానీ మధ్యప్రదేశ్ ఈ స్కాంలో చిక్కుకున్న వారు బడాబాబులే.
 
కేవలం నలుగురు మహిళలే వెనుక నుంచి నడిపారు. పెద్దవారే ఇందులో బయటపడ్డారు. ఈ స్కాంలో బయటపడిన వారి పేర్లు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. పోలీసుల సోదాలో 4 వేల వీడియోలు, ఆడియో క్లిప్పింగులు అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశారు. వీరు ఎంత చెబితే అంతచేశారు బడాబాబులు. తమ వ్యవహారం ఎక్కడ బయటపడిపోతుందేమోనని వారికి కావాల్సినంత డబ్బులు ఇస్తూ వచ్చారు. 
 
మొత్తం నలుగురు మహిళలే ఈ వ్యవహారాన్ని నడిపారన్నది తెలిసిందే. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, 8 మంది మాజీ మంత్రులు, 13 మంది ఐఎఎస్ స్థాయి అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. 92 హైక్వాలిటీ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఏ ఒక్క పార్టీ వ్యవహారం మాత్రం కాదు. కాంగ్రెస్, బిజెపి నేతలు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని రాజకీయాలను ఇది కుదిపేస్తోంది.
 
భోపాల్‌కు చెందిన ఓ యువతి ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి. పాతికమంది విద్యార్థులకు వలవేసి ఈ స్కాంను కొనసాగించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై వేదికలుగా ఈ స్కాం జరిగింది. అయితే ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు ఉన్నారట. 
 
వారి పేర్లు, వివరాలు మొత్తం పోలీసులు రహస్యంగా బయటకు తీస్తున్నారట. అయితే ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో ఈ వ్యవహారం కాస్త పెద్ద దుమారాన్ని రేపుతున్న నేపథ్యంలో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మొత్తం రాజకీయ నేతలే ఇందులో ఉండటంతో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారట.

పోలీసులు విచారణను వేగవంతం చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతల్లో భయం పట్టుకుందట. మరి చూడాలి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతారో.. లేకుంటే పక్క రాష్ట్రాలు కదా మనకేమీ సంబంధం అన్నట్లు వదిలేస్తారో.