శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:40 IST)

సొరకాయ వడలు..?

కావలసిన పదార్థాలు:
సొరకాయ - 1
మినప్పప్పు - 2 కప్పులు
పచ్చిమిర్చి - 2
జీలకర్ర - 1 స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
అల్లం ముక్క - చిన్నది
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా మినప్పప్పును 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీళ్లు ఒంపేసి గారెల పిండిలా రుబ్బిపెట్టుకోవాలి. సొరకాయ చెక్కు తీసి తురుముకోవాలి. ఈ తురుములో కొద్దిగా ఉప్పు కలిపి ఆపై వస్త్రంలో మూటకట్టి అరగంట పాటు ఉంచితే.. అందులోని నీరంతా పోతుంది. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న మినప్పిండిలో సొరకాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గారెల్లా ఒత్తుకుని నూనెలో వేయించి తీసుకోవాలి. అంతే... వేడివేడి సొరకాయ గారెలు రెడీ.