పడకగదిలో అద్దాలొద్దు.. ఏడ్చే యువతి, గుడ్లగూబ, డేగ పోస్టర్లు ఇంట్లో వద్దే వద్దు!

Selvi| Last Updated: బుధవారం, 11 మే 2016 (20:01 IST)
ఫెంగ్‌షుయ్ ప్రకారం పడకగదిలో అద్దాలను ఉంచకూడదు. అలా ఉంచితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఒకవేళ వాటిని పడకగది నుంచి తీసేయడం కుదరని పక్షంలో ఏదైనా వస్త్రంతో దానిని మూతవేయాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే పడకగదిలో డబుల్ కాట్‌లు ఉండకూడదు. ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి. డబుల్ కాట్‌ను కలపడం చేయకూడదు. రెండు మంచాలను కలిపి దానిపై పరుపు వేయడం మంచిది కాదని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు.

మరికొన్ని ఫెంగ్‌షుయ్ టిప్స్..
* టింక్లింగ్ బెల్స్ ఇంటి ముందు వేలాడదీయడం ద్వారా నెగటివ్ ఎనర్జీ విచ్ఛీనమై.. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చినట్లవుతుంది. అందుకే రెండు మెటల్ బెల్స్‌ను ఇంటి ముందు ఉంచడం మంచిది.
* మందులను వంట గదిలో ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
* మీ ఇంటి తలుపుల మీద స్వస్తిక్ ఇంకా ఓమ్ సింబల్స్‌ని ఉంచడం మంచిది.
* అయితే ఇంట్లో ఏడుస్తున్న యువతి, యుద్ద సన్నివేశాల చిత్రం, కోపంగా ఉన్న మనిషి, గుడ్ల గూబ ఇంకా డేగ ఇలాంటి పోస్టర్స్ ఉండకూడదట. వీటిలో ఏ ఒక్కటున్నా.. తీసేయడం మంచిదని ఫెంగ్‌షూయ్ నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :