శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 జూన్ 2015 (19:22 IST)

రత్నాలు రాశులను బట్టి ధరించవచ్చా?

రాశులను బట్టి, లగ్నాన్ని బట్టి, సంఖ్యలను బట్టి రత్నాలు ధరించడం ద్వారా శుభ ఫలితాలుండవని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి లగ్నమునకు శుభగ్రహం అయిన లగ్న, పంచమ, భాగ్యాధిపతులైన గ్రహాలు అనగా.. ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయిన రవి, భాగ్యాధిపతి అయిన గురువుకు సంబంధించిన రత్నాలు ధరించినచో కచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. 
 
శుభ గ్రహాలకు రత్నములు ధరించడంతో పాటు పాప గ్రహాలకు తగిన శాంతి జరిపించు కున్నచో కచ్చితంగా జాతకంలో ఉన్న దోషాలు తొలిగి మంచి ఫలితాలు పొందుతారని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.