ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Modified: సోమవారం, 1 ఆగస్టు 2016 (21:11 IST)

వర్షాకాలం వ్యాధులు... జలుబు చేస్తే రుచి తెలియదు ఎందుకని?

సాధారణంగా జలుబు చేస్తే ఆహారం రుచి, వాసన తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. నిజానికి జలుబు చేసేది ముక్కుకు. దీనివల్ల ముక్కు దిబ్బడవేసి శ్వాస పీల్చడం చాలా కష్టమవుతుంది. అయితే, జలుబు చేసినపుడు అన్నం, వంటకాల రుచి తెలిసే అవకాశం దా

సాధారణంగా జలుబు చేస్తే ఆహారం రుచి, వాసన తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. నిజానికి జలుబు చేసేది ముక్కుకు. దీనివల్ల ముక్కు దిబ్బడవేసి శ్వాస పీల్చడం చాలా కష్టమవుతుంది. అయితే, జలుబు చేసినపుడు అన్నం, వంటకాల రుచి తెలిసే అవకాశం దాదాపుగా ఉండదు. 
 
ముక్కుకు ఇబ్బంది చేస్తే నాలుకెందుకు పని చేయదనే సందేహం కలగవచ్చు. రుచి చివరగా నాలుకతో చూసినా ముందుగా రుచిని తెలియజెప్పేది ముక్కు. వంటకాలు తయారు చేస్తున్నప్పుడు వచ్చే సువాసనలు పీల్చగానే నోరూరుతుంది. 
 
కాబట్టి ముందుగా ముక్కు వాసన గుర్తిస్తేనే నాలుక రుచిని బాగా తెలుసుకుంటుంది. అందువల్లే జలుబు వలన ముక్కు పడకవేస్తే నాలుక రుచిని తెలుసునే శక్తిని కోల్పోతుంది.