గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 జులై 2022 (19:38 IST)

కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపే డేంజరస్ ఫుడ్ ఐటమ్స్

liver
ఇటీవలి కాలంలో కాలేయ వ్యాధులు అధికమవుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. దీనికి కారణం తీసుకునే ఆహారపదార్థాలు ప్రధాన కారణంగా వుంటున్నాయని చెపుతున్నారు. అవేమిటో చూద్దాం.

 
చక్కెర: ఎక్కువ చక్కెర కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్యాండీలు, కుకీలు, సోడాల్లో ఉండే ముడి లేదా శుద్ధి చేసిన చక్కెర కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

 
మద్యపానం: ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఆల్కహాల్ వల్ల వాపు లేదా సెల్ డెత్, ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. ఇది వాంతులు రక్తం, కామెర్లు, కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

 
మైదా పిండి: మైదా పిండి ఎక్కువగా ప్రాసెస్ చేసినందున, మినరల్స్, ఫైబర్ ఇతర ముఖ్యమైన పోషకాలు లేని కారణంగా ఇది మంచిది కాదు. పిజ్జా, పాస్తా, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైన వాటిని తినకూడదు.

 
ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్: బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్‌ని ఇష్టపడుతుంటారు చాలామంది. కానీ అవి జీర్ణం చేసుకోవడం కష్టం, ఇవి ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీయవచ్చు. అంతేకాదు సంతృప్త కొవ్వులను చేర్చగలవు.

 
రెడ్ మీట్: రెడ్ మీట్ కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది, జీర్ణం కావడం కష్టం. అధిక ప్రోటీన్ కొవ్వు కాలేయ వ్యాధులకు దారితీస్తుంది. కనుక కాలేయ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పైన పేర్కొన్న పదార్థాలను దరిచేరనీయకుండా చూసుకోవాలి.